21. సాధనాక్రమము పునశ్చరణ

                                           సాధనాక్రమము  (పునశ్చరణ)
               అన్యజనులైన వారు శరీరానుసారుల లక్షణములనెరిగి మరియు అవిశ్వాసుల లక్షణములను తెలిసికొని, యీ లక్షణములు దేవుని ఇచ్ఛకు వ్యతిరేకమైనందున, విడువ వలెనని ప్రయత్నము చేయవలెను. దురాశ, దుష్ట కార్యములనుండి విడుదల పొందినను, దేవుని యందు విశ్వాసము లేనివారికి అపవిత్రత, కాముకత్వము, లోభత్వము మొదలైనవి యుండును. విశ్వాసుల లక్షణములనెరిగి, దేవుని వైపుకు తిరుగవలెను. ఈ విశ్వాసము క్రియల వరకే పరిమితముకాక, హృదయపూర్వకముగా ఉండవలెను. నిబంధన గ్రంథములో వివరించిన క్రీస్తు లక్షణముల నెరిగి క్రీస్తుగా మారవలెను. అన్యజనులు మొదట అవిశ్వాసులుగా నైనా మారి, తరువాత తహతో సాధన చేసి విశ్వాసులుగా మారవలెను, పిదప క్రీస్తు లక్ష్యముగా తహతో సాధన చేసి క్రీస్తు గా మారవలెను. ఎందుకనగా  క్రీస్తు కాని వారందరికిని మంచి చెడు క్రియలకు తగిన మంచి చెడు ఫలితములను, మరణమునకు తీర్పు లభించుచున్నది. మరణమును తప్పించుకొనవలెనిన క్రీస్తు గా మారుటకు తహతో ప్రయత్నము చేయవలెను. ఎందుకనగా క్రీస్తుగా మారిన వారికి ఏవిధమైన తీర్పు ఉండదు. కనుక క్రీస్తు లక్ష్యముగా సాధన చేసి మరణమునకు తీర్పు లేని పరలోక రాజ్యమందు చేరి యుండుటకు లక్ష్యమును యేర్పాటు చేసికొనవలెను.

   అన్యజనుడైన వాడు తన దుష్ట కార్యముల నుండి విడుదల పొంది, విశ్వాసము వలన అవిశ్వాసులనుండి కూడా విడుదల కావలెను. హృదయపూర్వక విశ్వాసము చేత శరీరానుసారమైన సమస్త క్రియలను చేయుట నుండి విడుదల కావలెను. కాని తనకు తప్పని సరియైన శారీరక క్రియలను ఆత్మానుసారముగా  చేయుచూ, క్రీస్తు లక్ష్యమును సాధించవలెను. క్రీస్తు అనుభవము పొందినప్పుడు మాత్రమే మరణమునకు తీర్పు ఉండదు. పరలోకమందు మరణమునకు తీర్పు ఉండదు. కనుక మరణమును జయించిన క్రీస్తు గా మారి, క్రీస్తు నందే మేల్కొని యుండవలెను.  క్రీస్తు యొక్క అనుభవమును నిరంతరమును పొందియుంటూనే, మరల అన్యజనులలోను, అవిశ్వాసులలోను, విశ్వాసులలోను ఉన్నటు వంటి అనుభవములను తనకు అంటకుండా గ్రహించవలెను.

    మరణమును జయించిన క్రీస్తు స్థితికి మూలమైనది యేసు స్థితి. ఈ యేసు స్థితిని లక్ష్యములోనుంచు కొనుచు, శరీర క్రియలు చేయుచున్నను, తన క్రీస్తు స్థితిని పోషించుకొనుచుండవలెను. ఈ విధముగా చేయుచున్న యెడల క్రీస్తు  యేసు లో ప్రవేశించును. ఏక కాలములో యేసు స్థితిని, క్రీస్తు స్థితిని అనుభవించు చుండును. క్రీస్తు స్థితి లో తాను శరీరముగా నుండి శారీరక క్రియలను జరుపుచున్నను, తాను ఆత్మనని క్రీస్తు స్థితిని తన అనుభవములో కొనసాగించును. ఈ స్థితిని అందుకొనుటకు తను ఆత్మానుసారము జీవించుచూ, తుదకు తనను నడుపునది ఆత్మయేనని, శరీరానుసారమైన అనుభవమునుండి విడుదల పొందును. అయినను,  శరీర క్రియలు తనచే జరుపబడుచున్న విషయమును అనుభవింపక, యేసు స్థితి యొక్క అనుభవములో  ఆనందముగా నుండును. ఈ స్థితిలో పైన చెప్పినట్టి క్రీస్తు జీవితమును, తన లక్ష్యమైన యేసు స్థితిని ''అరమరికలు లేని ఆనందము'' అను అనుభవమును ఏక కాలములో పొందుచుండును. అనగా ఏక కాలములో  క్రీస్తు స్థితిని మరియు యేసు స్థితిని అనుభవించు చుండును.

     అనేకత్వమును అనుభవమునిచ్చు శారీరక క్రియల జ్ఞానము తనకు నశించినను, సర్వ వ్యాపకమైన, ఒక్కడే అయిన యేసు స్థితి అనుభవములో నిరంతరము ఉన్నందువలనను, తన కంటే అన్యమైన,



    రెండవది లేనిదై యున్నది కనుక ఒక చెంపమీద కొట్టినప్పుడు, ఆ క్రియను విస్మరించి యుండును. కనుక అతడు తిరిగి ఏ క్రియను ప్రతీకారముగా చేయడు మరియు తన తలపులో సైతం కలుగను కూడ కలుగదు. అప్పుడు మాత్ర””మే అతడు రెండవ చెంప చూపగలడు.

   ఈ విధముగా పరిపూర్ణమైన యేసు స్థితిలోనుండుటనే ''యేసు యీ సాధకుని తనలోనికి చేర్చుకొనుట''      యందురు. పరలోక రాజ్యమునందు స్థిరనివాసము యేర్పడవలెననిన, తండ్రియును, తనయుడును, పరిశుద్ధాత్మగానున్నచో ఒక్కటేననియు, యేసునందు చేర్చుకొనబడిన సాధకుడును దేవుని ఆత్మను ధరించిన వాడైనందును, అతడు కూడా పరిశుద్ధాత్మయేనను జ్ఞానము నొందవలెను.

    యెహోవా స్థితి అవ్యక్తమునై యుండి, కుమారుని పంపినప్పుడు తండ్రియై తండ్రి రూపములో సర్వ వ్యాపకమై యుండెను. తనయుడు చేయు క్రియలు తండ్రిచే నడిపినవే నను జ్ఞానము కలిగినవాడు    యేసు స్థితి నుండి విడుదల పొందును. యేసు రెండవ రాకడతో తనకు పరలోక రాజ్యమందు శాశ్వత నివాసము స్థిరమగును. తండ్రియైన  యెహోవా తనకు ప్రతినిధిగా యేసు క్రీస్తు అను నరుని మనలను మరణము నుండీ రక్షించుట కొరకు మన మధ్యకు పంపెను. క్రీస్తు స్థితిని మరియు సర్వవ్యాపక స్థితియైన యేసు స్థితిని అందుకొనుటకు శిలువపై క్రీస్తుగా మరణించి, యేసుగా పునరుత్థానమైన విధమును మనకు సాదృశ్య పరచెను. మనము దీని వివరము గ్రహించి, అనుసరించిన యెడల ఆయన వలె ఆయన పునరుత్థానములోను ఐక్యత నొందెదము. ఈ క్రియ శిలువపై జరిగినందువలన, శిలువను గుర్తుగా గ్రహించి సాధన చేయవలెను. ఆయన కార్యములన్నియు మనలను సైతాను బంధమునుండి విమోమనము చేయుటకును, మనలను మేల్కొలుపుటకును ఉద్దేశించ బడినవి. దానికి తగిన సహనము, త్యాగము, ప్రేమ, కరుణలను తన జీవితములోనే మనము గ్రహించునట్లు అందుకై తాను బలియర్పణ గావించెను. ఈ సాధన క్రమము మనలను చివరికి పరిశుద్ధాత్మగా, సర్వవ్యాపకముగా మార్చి, పరలోక రాజ్యమును పొందునట్లు చేయును.

పుష్పాంజలి

     ఓ పరిశుద్ధాత్మ స్వరూపా! నీవు ప్రాణులకు ఆధారము, బుద్ధికి ప్రేరణవు, ప్రాణమునకు పోషకుడవు. చరాచరములన్నియు నీ యందు కుదురుకున్నవ్ష్మి నీవు సర్వము నందు చొచ్చుకొని యున్నవాడవు, కాని దేనిని అంటని వాడవై సత్యముగా ఉన్నావు. అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత ఆనందముగా ఉన్న వాడవు. అట్టి పరిశుద్ధాత్మ అయిన నిన్ను శరణు  జొచ్చితిని. నీ ప్రేమ దృక్కులతోను, నీ దయా వీక్షణములతోను నన్ను అభిషేకించుము, ప్రభూ!

    ఓ దేవాదిదేవా! నా జీవన విధాతవు నీవని యెరుగనైతిన్ష్మి నీ న్యాయస్థానమున జరుగు తీర్పును శిరసావహించు సహనమును నా నుగ్రహించుము. నీవే మార్గమని యెరుగ నా స్వంత మార్గములో నడచితిని. శరీరానుసారుడనైతిని. నిజమునకు సర్వశక్తిమంతుడవు నీవేనని యిప్పుడు తెలిసికొంటిని. అహంకారుడనై చీకటిలో నడచితిన్ష్మి సత్యమును ఎరుగనైతిని. నీ సత్యస్వరూపములోనికి నన్ను నడిపించుము తండ్రీ!

    ఓ రుణామయా! నా బుద్ధి గుహయందు జ్ఞాన జ్యోతిని వెలిగించుము. నా హృదయ మందిరమందున్న నిన్ను నా కెరిగింపుము. నా జీవితమంతయు నీకే సర్వ సమర్పణ చేయగల సమాధానమును నా కొసంగుము.

    ఓ ప్రేమ స్వరూపా! నా కరణత్రయము పవిత్రముగను, నా కాయ త్రయము పావనముగను   కాలత్రయము నా భవమును దాటించునట్లు నన్ను ఆదరించుము. అనుగ్రహించుము. ఆశీర్వదించుము.



కరణత్రయము   వ  చేతలలో, మాటలలో, తలంపులలో జరుగు క్రియలు

కాయత్రయము వ  స్థూల శరీరము, సూక్ష్త శరీరము, కారణ శరీరము

కాలత్రయము   వ  భూత, భవిష్యత్‌, వర్త మాన కాలములు