19. అదృష్టవంతులు

19. అదృష్టవంతులు

     అదృష్టవంతులైన మీరు ఏమి చేయవలెను? ''తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి యేలాగు లేప బడెనో, ఆలాగే మనమును నూతన జీవము పొందిన వారమై, ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము కలవారమైన యెడల ఆయన పునరుత్థాన  సాదృశ్యమందును ఆయనతో ఐక్యము కలవారమై యుందుము.''(రోమా 6:4,5) ''కనుక దేవుని విషయమై క్రీస్తు యేసు నందు సజీవులుగాను మిమ్ములను మీరే యెంచు కొనుడి.''(రోమా 6:11)

    ''దేవుని ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువ బడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నదని యెరుగుదుము. వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ఱయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతి మంతులుగా తీర్చెను. ఎవరిని  నీతి మంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను'' (రోమా 8:28-30). ''మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చునప్పుడు మీరు శక్తి నొందెదరు.'' (అపొ.కా.1:5,8).

    ''మీ యొద్ద నుండి పరలోకమున చేర్చుకొన బడిన యీ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని ఆయనతో చెప్పెను'' (అపొ.కా.1:11). యేసు యొక్క యీ రాకడ  పరిశుద్ధాత్ములైన వారికి పరలోక రాజ్య నివాసమును సిద్ధము చేయును.

    ''ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదిగో ఇదే రక్షణ దినము'' (2కొరింధి 6:2). ''మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము  చేసికొనుచు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడచుకొను నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము అవివేకులు కాక ప్రభువు చిత్తమేమిటో గ్రహించు కొనుడి. మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు, కీర్తించుచు, మన ప్రభువైన యేసు క్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రియైన దేవునికి యెల్లప్పుడును కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి'' (ఎఫెసి 5:15-17,19-21).

    ''తండ్రియైన దేవుని నుండియు ప్రభువైన యేసు క్రీస్తు నుండియు సమాధానము, విశ్వాసముతో కూడిన ప్రేమయు, సహోదరులకు కలుగును గాక! మన ప్రభువైన యేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికందరికి కృప కలుగును గాక!''  (ఎఫెసి 6:23-24).

ఆమెన్ !