17. ఆశీర్వాదము
అన్యజనులకు విశ్వాసము కలుగునట్లును, విశ్వాసులు క్రీస్తుగా మారుటకును, క్రీస్తైన వాడు పరిశుద్ధ పరచుటకును ప్రభువు ద్వారాను, అపొస్తలుల ద్వారాను మనము దేవుడైన తండ్రిచేత ఆశీర్వదించ బడి యున్నాము.
''ఆత్మ మిమ్ము పరిశుద్ధ పరచుట వలన, మీరు సత్యమును నమ్ముట వలనను, రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచు కొనెను.''(2థెస్స 2:13) యేసు క్రీస్తు యొక్క మహిమను(చైతన్యమును) పొంద వలెనని ఆయన అపొస్తలుల సువార్త వలన మిమ్మును పిలిచెను. మరియు ''మీ హృదయములను ఆదరించి, ప్రతి సత్కార్యమందును ప్రతి వాక్యమందును మిమ్మును స్థిర పరచు గాక!'' (2థెస్స 2:17). దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించును గాక!
హృదయములను ఆదరించుట అనగా పరిశుద్ధాత్మ సత్యమని విశ్వసించుట, మరియు మనస్సునకు సంబంధించిన వన్నియు సాతాను సంబంధమైన అజ్ఞానము అని వాటిని విడచుట ఈవిధముగా హృదయములను ఆదరించ గలరు. సత్కార్యమనగా శాశ్వతమైన దేవుని తెలిసికొను సాధన. దీని వలన హృదయ ద్వారములు తెరువ బడును. ఈ ద్వారములు తెరువ బడినచో దేవుని ప్రతి వాక్యము మనయందు స్థిరపడును. అప్పుడు మాత్రమే ఆయన యందు చేరగలము. అందు కొరకు మన హృదయములు స్పందించ వలెననియు ఆయన అనుగ్రహమే కావలెను. ఇట్టి ఆశీర్వాదమే మనకు లభించుచున్నది.
''సమాధాన కర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడును ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించును గాక!'' (2థెస్స 3:16). ''పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించు కొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండును గాక!'' (కొలస్సి- 4: 14,15)
సమాధాన కర్త యనగా లక్ష్యమే తానయిన వాడును, అనుగ్రహించు వాడును అయియున్నవాడు. అన్నియు ఆయన వల్లనే కలిగి, ఆయన చేతనే జరుపబడుచున్నవని తెలిసి, సాతానుకు లోబడక ఉండునట్టి సాధకుని సంసిద్ధతను బట్టి ఆయన క్రీస్తు యేసుగా మేలు కొలుపుట అనెడి సమాధానము నిచ్చు కర్తగా నున్నాడు. ఈ విధముగా సాధనా సంపత్తి కలిగి, హృదయ పూర్వక విశ్వాసులైన సాధకులకు సదా ఆయన ఆశ్వీర్వాదము అందుచున్నది.